5 June, 2026 | 2:16 PM

అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్ కె.హరిత

05-06-2026 01:07 PM

కుమ్రం భీం  ఆసిఫాబాద్(విజయక్రాంతి): కాగజ్‌నగర్ మండలంలోని కొత్తసార్సాలా గ్రామం వద్ద జిల్లా కలెక్టర్ కె.హరిత ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను తనిఖీ చేసి అనుమతి పత్రాలను పరిశీలించారు. సరైన అనుమతులు లేకుండా వాగుల నుంచి ఇసుక, చెరువుల నుంచి మట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రారంభించిన “మన ఇసుక వాహనం” యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుని మాత్రమే ఇసుక రవాణా చేయాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ట్రాక్టర్ డ్రైవర్లు పాల్గొన్నారు.