5 June, 2026 | 2:32 PM

ఉపాధి హామీ కూలీలకు రూ.800 కూలి ఇవ్వాలి

05-06-2026 01:10 PM

రెండు సార్లు ఫోటో విధానం రద్దు చేయాలని డిమాండ్

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కాగజ్‌నగర్ మండలంలోని బోడపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.800 కూలి చెల్లించాలని, రెండు సార్లు ఫోటో తీసే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఫోటో నమోదు సమస్యల వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి కనీస వసతులు కల్పించాలని కోరారు. ఉపాధి హామీ చట్టంలో తీసుకొచ్చిన జీ-రామ్-జీ విధానాన్ని రద్దు చేసి, సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజన్న, మాజీ ఎంపీటీసీ, ఉపాధి హామీ కూలీలు, సంఘం నాయకులు పాల్గొన్నారు.