calender_icon.png 25 May, 2025 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు

25-05-2025 12:14:33 AM

8.25 శాతంగా నిర్ణయించిన కేంద్రం

న్యూఢిల్లీ, మే 24: ఎంప్లాయిస్ ప్రావిడెం ట్ ఫండ్ (ఈపీఎఫ్) వడ్డీ రేటును కేంద్రం ప్రకటించింది. 2024 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ ఖాతాలో డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగా నోటిఫై చేస్తూ కేంద్రం నిర్ణ యం తీసుకుంది. కేంద్రం వడ్డీని నోటిఫై చేసి న నేపథ్యంలో దేశవ్యాప్తంగా దాదాపు 7 కో ట్ల మంది ఈపీఎఫ్ చందాదారుల ఖాతాల్లో త్వరలో వడ్డీ జమ కానుంది.

గత 2023 ఆర్థిక సంవత్సరానికి కూడా కేంద్రం ఇదే 8.25 శాతం వడ్డీని చెల్లించిన సంగతి తెలిసిం దే. అయితే ఈపీఎఫ్ వడ్డీ రేటు 2020 21లో 8.5 శాతంగా ఉంది. దీనిని 2021 22లో 8.1 శాతానికి తగ్గించింది. 40 ఏళ్లలో ఇదే అత్యల్పం. అయితే 2022 మళ్లీ ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.15 శాతంగా నోటి ఫై చేసిన కేంద్రం 2023 వడ్డీ రేటు ను 8.25 శాతంగా ఖరారు చేసింది. ఈ ఏడా ది కూడా కేంద్రం అదే వడ్డీ రేటును యధాతథంగా ఉంచడం గమనార్హం.