25-05-2025 12:12:36 AM
24 గంటల్లో రికార్డు స్థాయిలో పాలసీల విక్రయం
న్యూఢిల్లీ, మే 24: ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) అరుదైన ఘనతను సాధించింది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో బీమా పాలసీలు విక్రయించి గిన్నిస్ వరల్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరి 20న ఈ అరుదైన ఘనతను సాధించినట్లు ఎల్‌ఐసీ ఒక ప్రకనటలో తెలిపింది. విస్తృతమైన ఏజెన్సీ నెట్‌వర్క్ కలిగిన తమ పనితీరును గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గుర్తించిందని ఎల్‌ఐసీ పేర్కొంది.
దేశవ్యాప్తంగా 4,52, 839 మంది ఏజెంట్లు ఈ ఏడాది జనవరి 20న 5,88,107 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల ను జారీ చేసినట్టు ఎల్‌ఐసీ తెలిపింది. బీమా చరిత్రలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయి లో పాలసీలు జారీ చేయడం ఇదే తొలిసారి. ఏజెంట్లు తమదైన పనితీరుతో ఒక బెంచ్‌మార్క్‌ను సృష్టించారని ఎల్‌ఐసీ స్పష్టం చేసింది. ఎల్‌ఐసీ కస్టమర్లు, వారి కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించాలనే లక్ష్యానికి నిబద్ధతగా నిలుస్తోందని తెలిపింది.