5 May, 2026 | 6:56 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

ఈపీఎఫ్‌వోలో 14.63 లక్షల సభ్యుల జత

23-01-2025 01:27 AM

ముంబై, జనవరి 22: ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో)లో గత ఏడాది నవంబర్‌నెలలో  నికరంగా 14.63లక్షల మంది సభ్యులు జతయ్యారు. గతంలో ఈపీఎఫ్‌ఓ నుంచి వైదొలిగి తిరిగి చేరినవారు కూడా వీరిలో ఉన్నారు.

ఈ నవంబర్ నెలలో 8.74 లక్షలమంది కొత్త సభ్యులు చేరారు.  కేంద్ర కార్మిక శాఖ తాజాగా విడుదల చేసిన పేరోల్ డాటా ప్రకారం గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ అక్టోబర్‌లో చేరికలు 16.58 శాతం పెరిగాయి.   కొత్త సభ్యుల్లో 18 ఏండ్ల వయస్సుగల యువ సభ్యులు 54.97 శాతం మంది ఉన్నారు.

అంతక్రితం ఏడాది నవంబర్‌కంటే 7.96 శాతం పెరిగారు. 2.50 లక్షల మంది కొత్త మహిళా సభ్యులు చేరారు. దేశంలో ఉపాధి అవకాశాలు పెరగడం, ఉద్యోగులకు లభించే ప్రయోజనాల పట్ల అవగాహన పెరగడం, ఈపీఎఫ్‌వో కార్యక్రమాల సమర్థత సభ్యత్వ పెంపునకు దోహదపడినట్టు కార్మిక శాఖ తెలిపింది. కొత్త చేరికలు మహారాష్ట్రలో అధికంగా 22.18 శాతం పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ వృద్ధి 5 శాతం మేర ఉన్నది.