9 May, 2026 | 5:27 AM

నేటి నుంచి ఎప్‌సెట్

09-05-2026 12:00 AM

౧౧ వరకు మూడు రోజుల పాటు నిర్వహణ

హాజరు కానున్న 2.10 లక్షల మంది విద్యార్థులు

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో శనివారం నుంచి ఎప్‌సెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,10, 766 మంది అభ్యర్ధులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. మే 9 నుంచి మే 11 వరకు  మూడు రోజులపాటు రోజుకు రెండు సెషన్‌లలో (ఉదయం, మధ్యాహ్నం)  పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మ ధ్యా హ్నం 12 గంటల వరకూ ఒక సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో సెషన్ ఉంటుంది.

ఉదయం సెషన్‌లో 7.30 గంటల కు, సాయంత్రం సెషన్‌లో మధ్యా హ్నం 1.30 గంటలకే పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులు చేరుకోవాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమ తించరు. పరీక్ష సమయం ముగిసేలో పు ఏ విద్యార్థి కూడా పరీక్షా హాలు నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించరు. ఒక్కో సెషన్‌లో సుమారు 35 వేలమంది చొప్పున విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం 12 5 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ ప్రొ ఫెసర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు.