17 April, 2026 | 3:11 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మాదకద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత

26-06-2025 01:19 AM

గజ్వేల్ లో విద్యార్థులతో మానవహారం ప్రదర్శన అవగాహన కల్పించిన సిఐ సైదా

గజ్వేల్, జులై 25:  యువత ఆనందం గుట్కా, మద్యం, సిగరెట్, గంజాయి వంటి వాటిని అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకోవద్దని గజ్వేల్ సిఐ సైదా యువతకు పిలుపునిచ్చారు. గజ్వేల్ బాలుర ఎడ్యుకేషన్ హబ్ ముందు విద్యార్థులతో కలిసి మానవహారం నిర్మించి డ్రగ్స్, గంజాయి మద్యం సిగరెట్ తదితర  వాటికి వ్యతిరేకంగా  ప్రతి ఒక్కరూ పని చేయాలని, యువత ఇలాంటి వాటిని అలవాటు చేసుకోవద్దని అవగాహన కల్పించారు.

స్వల్పమైన ఆనందాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని, కష్టపడి చదివించే, పెంచి పోషించే తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకొని సమాజంలో గౌరవంగా మసులుకోవాలన్నారు. బాగా చదివి ఉన్నత స్థానాలకు ఎదిగినప్పుడే తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు వస్తుందని, సమాజంలో చక్కని గుర్తింపు వస్తుందన్నారు. 

యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల  సందర్భంగా  సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆదేశాల మేరకు  ప్రజలకు, యువకులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలన్నారు. కార్యక్రమంలో హబ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.