17 April, 2026 | 2:33 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

నా ఫోనూ ట్యాప్ చేసి ఉండొచ్చు

26-06-2025 01:19 AM

ఎంపీ డా కే లక్ష్మణ్

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): 2016 20 మధ్య తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురై ఉండొచ్చని బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ కేసును సీబీఐకు అప్పగించాలన్నారు.

ఇది జాతీయ భద్రతకు అత్యంత ప్రమాదకరమైన అంశమని తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన పోలీసు అధికారుల వాంగ్మూలం మేరకు మాజీ సీఎం కేసీఆర్‌ను నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు. అయితే నిందితులు ఎవరో తెలిసినా వారిని అరెస్ట్ చేయడంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం కనిపిస్తోందని ఆరోపించారు. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, న్యాయ మూర్తులు, వ్యాపారవేత్తలు సహా కోరుకున్న వారందరి ఫోన్లు ట్యాప్ చేశారని.. ఇది సహించరాని నేరమని పేర్కొన్నారు.