calender_icon.png 26 June, 2025 | 12:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై పోస్టర్ విడుదల

26-06-2025 01:18:45 AM

కామారెడ్డి, జూన్ 25,(విజయ క్రాంతి): అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా పై గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగువాన్ తెలిపారు.  ఇందులో భాగంగా కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్ బుధవారం కలెక్టరేట్ లో ర్యాలీ పోస్టర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  ఉదయం 9:30 గంటలకు జిల్లా కేంద్రంలోని సి ఎస్ ఐ చర్చ్ నుండి కళాభారతి వరకు ర్యాలీ గా వెళ్లి అక్కడ కార్యక్రమ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సంక్షేమ అధికారి ప్రమీల,ఎక్సైజ్ సూపరిండెంట్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.