ఎరుకల నాంచారమ్మ బస్తీ ‘డబుల్ బెడ్‌రూమ్’ కాలనీ ఎన్నికలు
అధ్యక్షుడిగా గంగయ్య విజయం
ఎల్బీనగర్, జూన్ 1 : జీఎస్‌ఐ డివిజన్ లోని ఎరుకల నాంచారమ్మా బస్తీ(ఆదర్శ నగర్) డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ సంఘం ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఎన్నికల్లో మొత్తం 288 ఓట్లకు 280 ఓట్లు పోలయ్యాయి. మొదటి అభ్యర్థి జగన్నాధం గంగయ్యకు 126 ఓట్లు రాగా, రెండో అభ్యర్థి గుంజ బాలరాజు 33ఓట్లు, మూడో అభ్యర్థి గోపు శివ 87ఓట్లు, నాల్గవ అభ్యర్థి వనం రాజు 31ఓట్లు వచ్చాయి. మొదటి అభ్యర్థి గంగయ్య 39ఓట్ల మెజార్టీలో అధ్యక్షుడిగా గెలుపొందారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. గతంలో మాదిరిగానే కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారం, విద్యుత్ సరఫరా మెరుగుదల, లిఫ్ట్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు, పచ్చదనం పెంపొందించడం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు గంగయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాలనీ అభివృద్ధికి ఆయన కృషి చేయాలని ఆకాంక్షించారు.






