పొగాకు రహిత సమాజానికి పాటుపడాలి
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, జూన్ 1 (విజయక్రాంతి): ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (31 మే 2026) సందర్భంగా జిల్లాలో పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైద్య, విద్య, రవాణా, పోలీస్, అధికారులు తో కలెక్టర్ ప్రతి మాసింగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని, క్యాన్సర్, గుండె జబ్బులు, పక్షవాతం, ఊపిరితిత్తుల వ్యాధులు, నోటి సంబంధిత వ్యాధులు మరియు అకాల మరణాలకు ప్రధాన కారణమవుతుందని తెలిపారు. అలాగే, పొగ త్రాగని వ్యక్తులు కూడా పరోక్ష ధూమపానం (Second-hand Smoke) వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతారని పేర్కొన్నారు. ముఖ్యంగా పాఠశాలలు కళాశాలల వద్ద పాన్ బడ్డీలు ఉంటాయని అక్కడ పొగాకు ఉత్పత్తులు లేకుండా పోలీస్ శాఖ విద్యాశాఖ సమన్వయంతో పగడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు.
యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాలను అలవర్చుకోవాలని సూచించారు. పొగాకు రహిత సమాజ నిర్మాణం కోసం ఆరోగ్య శాఖ నిరంతరం అవగాహన కార్యక్రమాలు, చట్ట అమలు చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఎస్పీ ప్రసన్నకుమార్, నాన్-కమ్యూనికేబుల్ డిసీజ్ ప్రత్యేక అధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్, సీఎం ఓ రాజు, జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, డిడబ్ల్యువో హేమ భార్గవి, డిపిఆర్‌ఓ రామచంద్ర రాజు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.






