27-10-2025 06:58:57 PM
ఉప్పల్ (విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం నేపథ్యంలో నాచారం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ధనుంజయ్ గౌడ్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో అకాడమిక్ హై స్కూల్ విద్యార్థులు ఫోటోగ్రఫీ పరీక్షల్లో పాల్గొన్నారు. పోలీసులు ప్రజలకు చేస్తున్న సేవలు పలు ఫోటోగ్రఫీ ఫోటోలను వారి చిత్రీకరించారు. అదేవిధంగా మల్లాపూర్ సెంటెన్స్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు మారకద్రవ్యాల ముప్పు నివారణలో పోలీసుల పాత్ర విద్యార్థుల మారకద్రవ్యాలకు ఎలా దూరంగా ఉండాలనే అంశంపై రచన పోటీలో విద్యార్థినీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీలు చేసిన సేవలను ఇన్స్పెక్టర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్లు వెంకటయ్య మైబల్లి నాచారం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.