27-10-2025 07:01:25 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై అందించిన వినతులను త్వరగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు విన్నవిస్తూ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లకు వినతులను అందజేశారు.
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి వినతులను స్వీకరిస్తూ సమస్యలపై వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజల నుండి 112 వినతులు వచ్చాయని అన్నారు.