06-08-2025 04:44:43 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ కాంపౌండ్ నిర్మిస్తున్న నేపథ్యంలో బస్టాండ్కు (ఇన్ గేట్) వెనుక వైపు గేటు ఏర్పాటు చేయాలని స్థానిక నివాసులు,యజమానులు, వ్యాపారస్తులు కోరుతున్నారు. కాగా మనుషులు నడిచేందుకు ఏర్పాటు చేయాలని, వాహనాలు, టు వీలర్స్ వంటివి బస్టాండ్ లోపలికి రాకుండా తగు చర్యలు చేపట్టి కాంపౌండ్ నిర్మించాలని ఈ మేరకు స్థానికులు అందరూ కలిసి తాసిల్దార్ సుజాత కు, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ లకు వినతిపత్రం అందజేశారు. కాగా దశాబ్దాల క్రితం ఖానాపూర్ నడిబొడ్డున ఏర్పాటు అయిన నూతన బస్టాండ్ కు ప్రస్తుతం ఆర్టీసీ శాఖ నూతన కాంపౌండ్ వాల్ నిర్మాణం తలపెట్టింది.
కాగా ఈ బస్టాండ్ కు ఇప్పటికీ బస్సుల రాకపోకలకు ఒకే గేటు వినియోగిస్తుండగా బస్సులకు రాకపోకలకు ఇతర వాహనదారులకు నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఈ బస్టాండుకు ఇన్ గేట్ సౌకర్యం ఉన్నప్పటికీ అధికారులు అటు గేటు పూర్తిగా మూసివేయాలని కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టారు. ఇలా మూసివేస్తే బస్టాండును ఆనుకొని ఉన్న కాలనీలకు, ఇతర గ్రామాలకు వెళ్లే వారికి బస్టాండు సౌకర్యవంతంగా ఉండదని చుట్టూ తిరిగి రావాల్సి వస్తుందని దాంతో పాటు ఇక్కడ చిరు వ్యాపారాలు కూడా దెబ్బ తినే అవకాశం ఉంటుందని పేర్కొంటూ స్థానికులు అధికారులకు విన్నవించారు. మహిళలు ,వృద్ధులు ,రోగులు, ఇతర అవసరాలకు బస్టాండ్ చుట్టూ తిరిగి రావాలంటే వ్యయ ప్రయాసలకు గురికావాల్సి వస్తుందని వారు అన్నారు .ఈ కార్యక్రమంలో స్థానిక వ్యాపారులు యజమానులు మాజీ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, సుభాష్, కట్ట రాజన్న ,ఇస్తారు సుమన్, చిన్నం రవి ,రాకేష్, శ్రీకాంత్, షికారి రవి ,సతీష్ రావు దేశ్పాండే, రాజు, పలువురు ఉన్నారు.