06-08-2025 04:42:18 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): తలమల అటవీ శివారు ప్రాంతంలో సోమవారం చిరుతపులి దాడిలో లేగదూడ మృతిచెందగా యజమాని పూసం లచ్చుకు బుధవారం అటవీ క్షేత్రాధికారి కార్యాలయంలో రూ.12 వేల నష్టపరిహారం అందించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజర్ కే.అనిత మాట్లాడుతూ... వన్యప్రాణుల దాడుల్లో మృతిచెందిన పశువులకు అటవీశాఖ ఆధ్వర్యంలో వెంటనే స్పందించి పరిహారం అందిస్తున్నామని, వన్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు. అనంతరం లేగదూడ యజమాని పూసం లచ్చు మాట్లాడుతూ.... తక్షణమే 24 గంటల్లో స్పందించి పరిహారం అందించిన ఫారెస్ట్ డివిజనల్ అధికారి కే.సర్వేశ్వర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ అల్తాఫ్ హుస్సేన్, ఎఫ్ బీవోలు చంద్రశేఖర్, రాజశేఖర్, మాజీ సింగల్ విండో చైర్మన్ వెల్తేపు సుధాకర్ పాల్గొన్నారు.