06-08-2025 04:47:05 PM
మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్
కమాన్ పూర్ (విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిరవంచ కల అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను కాంగ్రెస్ పార్టీ సాకారం చేసిందని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్(Congress President Thotla Tirupati Yadav) అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా బుధవారం కమాన్ పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ అన్వర్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.