18 April, 2026 | 3:39 AM

ఈబీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి

15-06-2025 12:10 AM

-సీఎం రేవంత్‌రెడ్డికి ఈబీసీ జాతీయ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): తెలంగాణలోని ఈబీసీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మం త్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సీ ఎం రేవంత్‌రెడ్డికి ఈబీసీ జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డితో రవీందర్‌రెడ్డి భేటీ అయ్యారు.

రాష్ట్రంలో ఈబీసీ కమిషన్‌తోపాటు ఈబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పా టు చేయాలని రేవంత్‌రెడ్డిని కోరు తూ సీఎంకు వినతిపత్రం అందజేశా రు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు కూడా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి త్వరలో ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు.