03-02-2026 12:15:34 AM
తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఫిబ్రవరి 2: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి రూ.కోటితో పర్యాటక శాఖ అతిథి గృహాన్ని మంజూరి చేయిస్తానని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి చెప్పారు.సోమవారం మండల కేంద్రం అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు.అనంతరం నరసింహస్వామి సుదర్శన చక్ర మహా మంత్ర హోమం జరిపారు.ఆలయ అర్చకులు,పాలకమండలి చైర్మన్,సభ్యులు ఘనంగా స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేసి,తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు,ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిల సహకారంతో ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు.పర్యాటక అతిథి గృహ నిర్మాణం కోసం వెంటనే ఇంజనీరింగ్ అధికారులను పంపించి అంచనాలను రూ పొందించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, ఆలయ చైర్మన్ రాజేందర్ రెడ్డి, ధర్మకర్తలు బీరెల్లి శ్రీధర్ రెడ్డి, సోమయ్య,కాంగ్రెస్ జిల్లా నాయకులు తిరుమలప్రగడ కిషన్ రావు, మార్కెట్ డైరెక్టర్ భైరబోయిన సైదులు, కోమటి సోమయ్య,కేసాని రాహుల్,అమీనుద్దీన్, నగేష్, రాగి అనిల్, వెంకన్న, రమేష్, అర్చకులు అర్వపల్లి రాంబాబు అయ్యంగార్, యోగానంద దీక్షితులు, పవన్, ఆలయ అధికారులు శ్రీనివాస్ రెడ్డి,సదాలక్ష్మి తదితరులు ఉన్నారు.