25 August, 2026 | 3:18 PM

జనావాసాలకు దూరంగా ఇథనాల్ పరిశ్రమ ఉండాలి

28-11-2024 01:23 AM

బీజేఎల్పీ నేత  మహేశ్వర్‌రెడ్డి డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ పరిశ్రమను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సమస్యపై గుండంపల్లి రైతులతో చర్చించి న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. దిలావర్‌పూర్ జేఏసీతో ఈ అంశంపై ఇప్పటికే రెండుసార్లు చర్చించామన్నారు.

సమస్యను సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లామని.. పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించే వరకు పోరాటం చేస్తామన్నారు. పోలీసు అధికారులు రైతులపై కేసులు పెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.