గరిటెడైనను చాలు ఖరము పాలు!
27-07-2025 12:00 AM
గరిటేడు ఖరము పాలు @ 600
మహబూబాబాద్, విజయక్రాంతి: గంగిగోవు పాలు గరిటడైన చాలు.. కడివడైననేమి ఖరము పాలు.. అనే నానుడి గతం ముచ్చట.. ఇప్పుడు ఆ నానుడి పూర్తిగా మారింది. గరిటెడు ఖరము పాలు కావాలంటే రూ.600 ఖర్చు చేయాల్సిందే. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో గత కొద్దిరోజులుగా గాడిదలను ఊరంతా తిప్పుతూ పాలు విక్రయిస్తున్నారు.
ఖరము పాలు ఎంతో శ్రేష్టమైనవని, చంటి పిల్లలకు ఈ పాలు తాగిస్తే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు శరీర రక్షణ వ్యవస్థ పెంపొందడం, అలెర్జీలు, శ్వాస సంబంధిత రోగాలకు ఉపశమనం కలుగుతుందని, శాస్త్రీయంగా గాడిద పాలు చంటి బిడ్డలకు మరింత మేలు చేస్తాయని భావిస్తుండటంతో గాడిద పాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.






