15 June, 2026 | 7:34 PM

Breaking News

పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •  

ఆ విషయంలో రాజీపడ్డా

26-01-2025 01:15 AM

‘పుష్ప2’తో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది రష్మిక మందన్న వరుస విజయాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఛావా’ చిత్రంలో శంభాజీ సతీమణి ఏసుబాయిగా నటిస్తోంది. ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ‘సికందర్’, ‘కుబేర’, ‘ది గర్ల్ ఫ్రెండ్’, ‘రెయిన్ బో’, ‘థామ’ల్లోనూ నటిస్తోంది. అయితే ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ‘కుటుంబమే నా బలం.

కీలక సమయాలను కుటుంబంతోనే గడుపుతా. నా చెల్లి అంటే నాకెంతో ఇష్టం. వరుస షూటింగ్స్ వల్ల తనను ఎంతో మిస్ అవుతున్నా. తను భవిష్యత్తులో అద్భుతమైన మహిళగా మారనుందని నమ్ముతా. ఈ జర్నీలో నేను రాజీపడిన అతిపెద్ద విషయం.. ఫ్యామిలీని మిస్ అవుతుండ టమే.

వ్యక్తిగతమైన, వృత్తిపరమైన విషయాలకు ఒకేసారి టైమ్ ఇవ్వడం అంత సులభం కాదు. ఒకదాని కోసం మరొకటి త్యాగం చేయాల్సి వస్తుందనే మాటను కెరీర్ ఆరంభంలో మా అమ్మ చెప్పటం నాకింకా గుర్తుంది. వృత్తిపరమైన కమిట్‌మెంట్స్ నిలబెట్టుకోవ డానికి ఫ్యామిలీ టైమ్ త్యాగం చేయాల్సి ఉంటుంది’ అని చెప్పింది రష్మిక.