20-07-2025 12:23:09 AM
మిల్కీ బ్యూటీగా ప్రేక్షకుల గుండెల్లో చోటు దక్కించుకున్న తమన్నా భాటియా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాల్సిన సమయం వచ్చిందని కొందరు అంటుంటే.. ఇప్పటికే షురూ అయ్యింది కదా! అనేది మరొకొందరి అభిప్రాయం. ఎందుకంటే తమన్నాకు గతంలో లాగా ఆశించిన స్థాయిలో పెద్ద సినిమా అవకాశాలేవీ వస్తున్నట్టు లేదు. చిన్న సినిమాల్లో హీరో యిన్‌గా నటించే అవకాశాలు వచ్చినా అవి వర్కౌట్ కావడం లేదనే విమర్శ ఉంది.
అయితే, పెద్ద సినిమాల్లో అవకాశాలు అంటే.. ఎక్కువ శాతం ఐటం సాంగ్స్ ఉంటున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోలు, మ్యూజిక్ ఆల్బమ్స్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమెకు గతంలో మాదిరి స్టార్‌డం లేదని నెటిజన్స్ బాహాటంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమన్నా వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులు ఎదుర్కొం టోం ది. నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమ చెడిందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
కానీ, బ్రేకప్ విషయమై ఇప్పటివరకు వీరిద్దరి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇదిలా ఉండగా, తాజాగా తమన్నా సోషల్‌మీడియాలో చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. కొన్ని తన రెగ్యులర్ డే ఫోటోలు, వీడియోలను తమన్నా షేర్ చేస్తూ.. “ప్రస్తుతం నేను గుర్తించే దశలో ఉన్నాను. సగం డిజైనర్, సగం డిటెక్టివ్‌గా ఉన్నానేమో అనిపిస్తోంది. ఇలాంటి సమయం లో ప్రతీదీ చాలా ముఖ్యం.
అంతేకాకుండా ప్రతి తప్పూ మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంంది. ఇప్పుడు మనం పరిపూర్ణం కాదు. అయితే మనం దారిలోనే ఉన్నాం. ముందుముందు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి వస్తువూ మెరిసేందుకు ఒక ప్రక్రియ ఉంటుంది. అందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది” అని తమన్నా పేర్కొంది.
ఉన్నట్టుండీ తమన్నా ఇలాంటి నోట్ రాయడంతో ఇది బ్రేకప్‌ను ఉద్దేశించి రాసిందేనని భావిస్తున్నారు. ఏదేమైనా మనసులో ఉన్నదంతా బయటకు పెట్టేసి ఫ్రేష్‌గా మళ్లీ కెరీర్ ప్రారంభించాలని అభిమానులు సోషల్‌మీడియా వేదికగా సలహా ఇస్తున్నారు.