calender_icon.png 21 July, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిన్నైతే లవ్ చేయను!

20-07-2025 12:21:37 AM

తన అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరైంది బాలీవుడ్ భామ పూనమ్ బజ్వా. 2005లో ‘మిస్ పూణె’ కిరీటం గెలుచుకున్న ఈ బొద్దుగుమ్మ అదే ఏడాది ‘మొదటి సినిమా’ అనే చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. పలు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల సినిమాలకు కొంత విరామం ఇచ్చి, కుటుంబం తోనే ఎక్కువగా గడుపుతోంది. అప్పుడప్పుడూ సోషల్‌మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు లైన్‌లోకి వస్తుంది.

అలా ఈ బ్యూటీ తాజాగా ‘ఆస్క్ ఎనీథింగ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిట్‌చాట్ నిర్వహించింది. ఈ ఇంటరాక్టివ్ సెషన్‌లో పాల్గొన్న ఫ్యాన్స్ నుంచి ఎదురైన చిలిపి ప్రశ్నలకు అంతే సరదాగా బదులిచ్చింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘పూజా జీ ఐ లవ్ యూ’ అంటూ పూనమ్ బజ్వాకు ప్రపోజ్ చేశాడు.

తొలుత కొద్దిగా షాక్ తిన్న పూనమ్.. వెంటనే తనదైన శైలిలో ఫన్నీగా స్పందించింది. “అది నువ్వు పూజాను అడగాలి.. నేనైతే లవ్ చేయను” అని తెలిపింది. తనను ఉద్దేశించే అలా అన్నాడని తెలిసినా ‘పూజా జీ’ అన్నాడు కాబట్టి, ఫన్నీగా రిప్లు ఇచ్చింది.