calender_icon.png 21 July, 2025 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేక్షకుల ప్రోత్సాహంతోనే కొత్త నటుల కల సాకారం

21-07-2025 12:11:06 AM

‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి చిత్రాలతో అనుబంధం ఉన్న నటి-, చిత్ర నిర్మాత ప్రవీణ పరుచూరి తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ నిర్మించిన సినిమాలో మనోజ్‌చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ నెల 18న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తమ సినిమా ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్రబృందం ఆదివారం హైదరాబాద్‌లో థ్యాంక్స్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయ కుడు మనోజ్ చంద్ర మాట్లాడుతూ... “రామకృష్ణ పాత్రతో మీరందరూ కనెక్ట్ అయి ఎంకరేజ్ చేసిన విధానం నాకు ఆనందాన్నిచ్చింది” అన్నారు.

చిత్ర దర్శకురాలు ప్రవీణ పరుచూరి మాట్లాడు తూ.. “ఇండీ సినిమా తీయాలంటే చాలా కష్టం.. ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లడం ఇంకా పెద్ద టాస్క్. అయితే ఈ జర్నీ ఎంత కష్టమైనా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఒక నమ్మకం గురించిన కథ ఇది. రామకృష్ణ, ఉష పాత్రలకు చాలా మంచి స్పందన వచ్చింది. నటులు కావాలని వాళ్ల కలను ప్రేక్షకులు నెరవేర్చినందుకు చాలా ఆనందంగా ఉంది” అన్నా రు. ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ మెహరా బాబా, నటి ఉషా బోనేలా, మౌనిక, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.