4 May, 2026 | 3:00 AM

నగల దుకాణంలో దోపిడీ

04-05-2026 01:48 AM
  1. తుపాకులతో ప్రవేశించి, కాల్పులు జరిపిన దుండగులు 
  2. సిబ్బందిని బెదిరించి, కింద కూర్చోబెట్టి నగలు అపహరణ
  3. అడ్డుకోబోయిన నలుగురు సిబ్బందికి గాయాలు 
  4. కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షాపులో ఘటన 
  5. నిందితుల కోసం పోలీసుల గాలింపు 
  6. జాడ చెప్పిన వారికి రూ. లక్ష రివార్డు 
  7. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, మే 3 (విజయక్రాంతి): కరీంనగర్‌లోని పీఎంజే బంగారు నగల దుకాణంలో ఆదివారం సినీఫక్కీలో దోపి డీ జరిగింది. తుపాకులతో ప్రవేశించిన ఐదుగురు దుండగులు కాల్పులు జరిపి, సిబ్బందిని బెదిరించి, కింద కూర్చోబెట్టారు. ఆ తర్వాత దుకాణంలోని నగల ను బ్యాగులో పెట్టుకుని, బైకులపై పరారయ్యారు. నిందితుల దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించిన పోలీసులు.. వారి జాడ తెలిపిన వారికి రూ.లక్ష నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.

కరీంనగర్‌లోని ప్రధాన రహదారిపై ఉన్న పీఎంజే జ్యువెలరీ షాపులోకి ఆదివారం ఉదయం 10.45 గంటలకు తొలుత ఒక వ్యక్తి వచ్చి 20 గ్రాముల చైన్ కావాలని సిబ్బందిని కోరాడు. కాసేపటికే మరో ఇద్దరు వచ్చి ఆభరణాలు కొంటాం చూపాలన్నారని తెలిసింది.

సిబ్బంది బంగారు ఆభరణాలు చూపిస్తున్న సమయంలో మరో ఇద్దరు వచ్చారని, దుండుగులు తెలుగు, హిందీ భాషలు మాట్లాడుకున్నారని సిబ్బంది తెలిపారు. ఇలా మొత్తం ఐదుగురు దుండగులు తుపాకులతో ప్రవేశించారు. కస్టమర్ల ముసుగులో వచ్చిన వీరు, లోపలికి రాగానే తుపాకులు తీసి బెదిరించారు. సిబ్బంది అడ్డుకోవడానికి ప్రయత్నించగా, తుపాకులతో కాల్పులు జరిపారు. 

ఈ కాల్పుల శబ్ధంతో షోరూమ్ లోపల ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. దుండగుల దాడిలో నలుగురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమి త్తం ఆస్పత్రికి తరలించారు. అయితే భద్రతా సిబ్బందిని, సేల్స్‌మెన్లను భయభ్రాంతులకు గురిచేసిన దుండగులు.. ప్రదర్శనకు ఉంచిన భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను దోచుకుని పారిపోయారు. సమాచారం అందిన వెంటనే కరీంనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. జ్యోతి నగర్ గల్లీ నుంచి దుండగులు పారిపోయే క్రమంలో బైకుపై నుంచి కిందపడ్డారు. కంగారులో రెండు బుల్లెట్స్, ఒక మ్యాగజైన్‌ను అక్కడే వదిలేశారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇది దర్యాప్తులో అత్యంత కీలక ఆధారంగా మారనుంది. దోపిడీ దొంగలు ఎటువైపు వెళ్లారు, ఏ వాహనంపై వచ్చారనే విషయాన్ని తెలుసుకోవడానికి నగరంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఈ ఘటనతో కరీంనగర్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరం నుంచి బయటకు వెళ్లే అన్ని రహదారులపై తనిఖీలు చేస్తున్నారు. సరిహద్దు జిల్లా ల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. పట్టపగలే, రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి దోపిడీ జరగడం సంచలనంగా మారింది. దోపిడీ దొంగ లు అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన వారా లేక స్థానికులా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

తెలంగాణ మల్టీజోన్ ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి, కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప లువురు పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారు.

ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష 

ఈ ఘటనకు సంబంధించిన దుండగుల దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యా యి. వారి చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. గ్రామాలు పట్టణాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే  పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సీపీ గౌస్ అలం కోరారు. నలుపు రంగు పల్సర్ బైక్, తెలుపు రంగు అపాచీ బైక్‌లపై నిందుతులు సంచరిస్తున్నట్టు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన వ్యక్తులను ఎవరై నా గుర్తించినట్లయితే లేదా వారికి సంబంధించిన సమాచారం ఉన్నట్లయితే డయల్ 100 లేదా 8712670744, 871267 0745 నంబర్లకు తెలియజేయలని కోరారు.

ఘటన స్థలాన్ని పరిశీలించిన : కేంద్ర మంత్రి బండి సంజయ్..

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ జ్యువెల్లరీ షాపును పరిశీలించారు. దుండుగులను అడ్డుకునేందుకు సిబ్బంది చూపిన తెగవ ప్రశంసనీయమన్నారు. కాల్పుల ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన చికత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నామని చెప్పా రు. ఈ ఘటన జరిగే సమయానికి కొద్ది నిమిషాల ముందు ఈ ప్రాంతంలోనే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం లో బండి సంజయ్ పాల్గొన్నారు.

పోలీసులు కూడా ఉన్నారు. ఎన్ని అభరణాలు ఎత్తుకెళ్లారనేది పోలీసుల విచారణలో తేలుతుంద న్నారు. కాగా కరీంనగర్ లోనీ పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలార్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరామర్శించారు.