30 July, 2026 | 8:45 PM

Breaking News

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా..

18-06-2024 04:26 AM
  • కృతజ్ఞత సభలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ 

మేడ్చల్, జూన్ 17 (విజయక్రాంతి): ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ పరిధిలోని మచ్చబొల్లారంలో సోమవారం నిర్వహించిన కృతజ్ఞత సభ, వినాయకనగర్‌లో జరిగిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకిచ్చిన దరఖాస్తులే కాకుండా ప్రత్యక్షంగా తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మేడ్చల్‌కు మెట్రో, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు ఫ్లువర్, హెచ్‌ఎంటీఎస్ సమస్యలకు తప్పకుండా పరిష్కారం చూపుతానని తెలిపారు. తాను ప్రజల విశ్వాసం, నమ్మకాన్ని పొంది గెలిచిన వ్యక్తినని.. ఈ ఐదేళ్లు వారి నమ్మకాన్ని నిలబెట్టడమే కర్తవ్యంగా భావిస్తాన న్నారు. తనకు ప్రజలే వీవీఐపీలని స్పష్టం చేశారు. అనంతరం ఆయనను పార్టీ శ్రేణు లు, స్థానిక ప్రజలు ఘనంగా సన్మానించారు.