30 July, 2026 | 7:46 PM

ఘనంగా సురక్ష ఇన్‌ఫ్రా ౩వ వార్షికోత్సవం

18-06-2024 04:30 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (విజయక్రాంతి): సురక్ష ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ మూడో వార్షికోత్సవం నాగోల్‌లోని ప్రధాన కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా చైర్మన్ పల్లె కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సంస్థకు సహకరిం చిన మార్కెట్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గత మూడు సంవత్సరాలుగా యాదగిరిగుట్ట, ఘట్‌కేసర్, తారామతిపేట, మంగళంపల్లి, నార్కట్‌పల్లి వెంచర్లలో సకాలంలో సేల్స్ టార్గెట్స్ పూర్తిచేసిన సిబ్బందికి విదేశీ టూర్లు ఉంటాయని తెలిపారు. వచ్చే నెల నుంచి న్యూ వెంచర్ ఎల్పీ నంబర్లు వస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎండీ వినూత్నరెడ్డి, డైరెక్టర్ సుధాకర్‌చారి, మార్కెటింగ్ సిబ్బంది యాదగిరి, సంధ్యారాణి, రేఖ, నరసింహాచారి, పోతుల రాయ ప్ప, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.