ప్రతి ఓటరుకు అవగాహన కల్పించాలి
10-07-2026 02:03 AM
మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
ఆత్మకూరు, జూలై 9: ప్రతి ఓటర్ కు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని బిఆర్‌ఎస్ పార్టీ నాయకులను, బూతు స్థాయి ఏజెంట్లకు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సూచించారు. గురువారం పట్టణంలో టిఆర్‌ఎస్ కార్యకర్తల బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గాయత్రీ రవికుమార్, మాజీ కౌన్సిలర్ మండల రామకృష్ణ, మాజీ ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, మాజీ వైస్ ఎంపీపీ కోటేశ్వర్, మాజీ టిఆర్‌ఎస్ పార్టీ సర్పంచులు, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






