మండల బీసీ సెల్ అధ్యక్షుడిగా రుస్తుం నవీన్ రావు
10-07-2026 02:01 AM
సదాశివ నగర్, జూలై 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల బీసీ సెల్ అధ్యక్షునిగా బొంపల్లికి చెందిన రుస్తుం నవీన్ రావు ను నియమించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు, డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆదేశాలను నియామకం చేసినట్లు నవీన్ రావ్ తెలిపారు.
ఈ సందర్భంగా రుస్తుం నవీన్ రావు మాట్లాడుతూ నాపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులుగా నియమించిన. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు. కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ కు సదాశివనగర్ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.






