calender_icon.png 23 June, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ టాపింగ్ కేసులో ప్రతి ఒక్కరూ జైలుకెళ్లడం ఖాయం

23-06-2025 02:00:02 AM

  1. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

కేసీఆర్, కేటీఆర్ ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ 

సినీ తారలను తీవ్రంగా వేధించారు 

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు 

నిజామాబాద్ జూన్ 22:(విజయ క్రాంతి): తెలంగాణతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ కేటీఆర్ ప్రమేయంతోనే 650 ఫోన్ల ట్యా పింగ్ జరిగిందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

ముఖ్యంగా బడా నాయకులు తో పాటు పలువురు సినీ తారల ఫోన్లు టాపింగ్ చేసి వారిని అతి దారుణంగా ఇబ్బందుల గురిచేసారని కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆదివారం ఉదయం విలేకరులతో మాట్లాడుతూ..మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్ ల ప్రమేయంతోటే ఫోన్లో టాపింగ్ జరిగిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశంలో ఎక్కడా ఎప్పుడు లేని విధంగా అప్పటి తెలంగాణ టిఆర్‌ఎస్ సర్కార్ తమలాంటి నాయకుల ఫోన్ లే కాకుండా ఆనాడు కొంతమంది సినీ తారల ఫోన్లను కూడా టాపింగ్ చేసి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. ప్రభుత్వంలో ఉన్న బడా బడా ముఖ్య నాయకులు ముఖ్యమైన పెద్ద పెద్ద అధికారుల తోపాటు వారి అవసరాల కోసం వారి ఇష్టానుసారంగా ఇష్టమైన రీతిలో ఫోన్ లేని టాపింగ్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.

రాజకీయ నాయకులు సినీ తారలు ప్రముఖ పారిశ్రామికవేత్త లతోపాటు కొంతమంది జడ్జిల ఫోన్లను కూడా టైపింగ్ చేసిన నీచమైన చరిత్ర బిఆర్‌ఎస్ పార్టీ దని ఇది కేవలం కేటీఆర్ కేసీఆర్ ప్రమేయంతో జరిగిందని మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సిట్ అధికారులు ఫోన్లో టైపింగ్ విషయాన్ని బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

పౌరుల గోప్యత హక్కుని కాలరాస్తూ ఫోన్లు టాపింగ్ కు పాల్పడ్డారని ఎవరెవరి ఫోన్ల ట్యాపింగ్ కు గురయ్యారో వారంతా నిర్భయంగా వచ్చి ఫిర్యాదు చేసి విచారణకు హాజరు కావాలన్నారు. ఇంత పెద్ద నేరం చేసిన కేసీఆర్ కేటీఆర్ లా ప్రమేయం లేనిదే ఫోన్ టాపింగ్ జరగదని వీరి ఆజ్ఞ లేనిదే  ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు ఫోన్లో టాపింగు పాల్పడి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.