27 June, 2026 | 2:36 AM

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి

27-06-2026 12:39 AM

హుస్నాబాద్‌లో అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ 

హుస్నాబాద్, జూన్ 26: మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఏసీపీ సౌడారపు సదానందం అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినో త్సవం సందర్భంగా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమం లో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ వ్యసనం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, సమాజంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్త్స్ర లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెన్న రాజు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వీవీ రమణ, కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, ప్రజలు పాల్గొని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు.