20 August, 2026 | 12:05 AM

కంపోజింగ్‌లో సవాల్ విసిరిన చిత్రం.. ‘ఇరుముడి’

19-08-2026 11:23 PM

మాస్ మహారాజా రవితేజ నుంచి తాజాచిత్రం ‘ఇరుముడి’. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ కాగా, బేబి నక్షత్ర కీలక పాత్రలో నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ తెలిపిన సినిమా విశేషాలివీ.. 

-నేను ప్రేమకథలు, కమర్షియల్ సినిమాలు చాలా చేశా. ‘ఇరుముడి’ మాత్రం చాలా ఇంటెన్స్ థ్రిల్లర్. దర్శకుడు శివ నిర్వాణ కథ చెప్పినప్పుడే నేను అందులో లీనమైపోయా. తెలుగు సినిమాకు ‘ఇరుముడి’ చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో వచ్చే మలుపులను ప్రేక్షకులు ఊహించలేరు. ఈ సినిమాకు పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇది చాలా మంచి సినిమా అవుతుంది. ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. మేము మా బెస్ట్ ఇచ్చాం. ఈ సినిమాకు బెస్ట్ రీజినల్ ఫిలిం, బెస్ట్ చైల్ ఆర్టిస్ట్.. ఇలా చాలా నేషనల్ అవార్డ్స్ వస్తాయని నేను ఆశిస్తున్నా. అలాగే కమర్షియల్‌గా కూడా సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా.

-ఈ సినిమా మ్యూజిక్ నాకు చాలా ప్రత్యేకం. ఇందులో ప్రతిదీ సైకలాజికల్‌గా ఉంటుంది. మనం ఒకటి ఊహిస్తాం కానీ, వేరే మలుపు వస్తుంది. అలాగే పాత్రలు మారే విధానం, సంఘటనలు, సన్నివేశాలు.. ఇవన్నీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే నేను మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఇంటెన్స్ సైకలాజికల్ థింకింగ్‌తో అప్రోచ్ అయ్యా. ‘ఓంకార’ అనే ఒక సినిమా ఉంది. ఆ సినిమా మ్యూజిక్‌కు చాలా సైకలాజికల్ అప్రోచ్ ఉంటుంది. నేను ‘ఇరుముడి’ స్కోర్‌కు కూడా అలాగే ట్రీట్ చేశా. 

-పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మ్యూజిక్ విషయంలో రవితేజ చాలా హ్యాపీగా ఉన్నారు. క్లైమాక్స్‌లో చేసిన పాట ఆయనకు చాలా నచ్చింది. అది ఇంకా రిలీజ్ చేయలేదు. అది చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌కు చాలా కీలకంగా ఉండే ఆ పాట రవితేజకు చాలా ఇష్టం. 

‘మల్లెపూల పల్లకి’ చాలా అద్భుతమైన భక్తి గీతం. ఆ పాటకు చాలామంది అభిమానులున్నారు. వాళ్లందరినీ మేము దృష్టిలో పెట్టుకొని, ఇందులోని ప్రతి పాటనూ చాలా రియల్‌గా చేశాం. -గత నాలుగు రోజుల నుంచి ‘మల్లెపూల పల్లకి’ పాట ఇండియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఇది ఒక ఐకానిక్ సాంగ్. అందుకే ఆ పాటను ఒరిజినల్ సింగర్‌తోనే పాడించాం. ఈ పాట వాళ్లు పాడితే బాగుంటుంది, ఒక సెలబ్రేషన్‌లా ఉంటుందని, ఒరిజినల్‌గా పాడిన బృందంతోనే పాడించాం.

నేను కథ మొత్తం విన్న తర్వాత ఆ సినిమాకు, ఆ కథకు ఎలాంటి సంగీత ప్రపంచాన్ని సృష్టించాలనేది ఆలోచిస్తా. అందుకే కథ విషయంలో నేను చాలా పర్టికులర్‌గా ఉంటా. పూర్తి కథను క్షుణ్ణంగా వింటా.

ఈ సినిమా మొత్తానికి నేను ఒక సైకలాజికల్ మ్యూజిక్ చేశా. రెండు మూడు లేయర్స్‌లోనే మ్యాజిక్‌ను క్రియేట్ చేసే ప్రయత్నం చేశా. మూడు లేయర్స్‌లో ప్రభావవంతమైన సంగీతం రూపొందించడం చాలా సవాలుతో కూడుకున్న పని. ‘ఇరుముడి’లో అలాంటి మ్యాజిక్ కుదిరింది. 

-ఇందులో భక్తి, సైకాలజీ, క్రైమ్, యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్.. ఇలా అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. వాటన్నింటినీ మ్యూజికల్‌గా బ్యాలెన్స్ చేశాం. ఇలాంటి సినిమాకు మ్యూజిక్ చేయడం చాలా ఛాలెంజింగ్. 

ఈ సినిమాలో -నాకు ‘యాలాలో..’ పాట చాలా ఇష్టం. ఎందుకంటే ఇది ‘ఇరుముడి’కి ఆత్మ లాంటి పాట. మొత్తం ఐదు పాటలు ఉంటాయి. అవన్నీ కూడా కథలో భాగమైన పాటలు. 

-శివ నిర్వాణ చాలా మంచి మ్యూజిక్ టేస్ట్ ఉన్న డైరెక్టర్. ఆయన సినిమాల్లో పాటలన్నీ కూడా ప్రజాదరణ పొందినవే. ఆయన మ్యూజిక్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. ఆయనకు లిరిక్ నాలెడ్జ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయనకు పల్లవి వినిపిస్తే లిరిక్స్ చెప్పేస్తారు.

-ఈ సినిమా మాత్రం శివ నిర్వాణ గత సినిమాలకు చాలా భిన్నంగా ఉంటుంది. చాలా సీరియస్ ఫిలిం. -‘-విక్రమార్కుడు’ తర్వాత రవితేజ సినిమాల్లో నా ఫేవరెట్ సినిమా ఇదే. ‘ఇరుముడి’ చాలా ఇంటెన్స్ థ్రిల్లర్. ప్రేక్షకులు ఈ సినిమానున మర్చిపోలేరు. తెలుగు సినిమాలో ట్రెండ్ సెట్టర్ అవుతుంది. 

నటుడిగా సంగీత దర్శకుడిగా నా వర్క్‌ను బ్యాలెన్స్ చేసుకునే విధానం గురించి చెప్పాలంటే.. -నెలను రెండు భాగాలుగా చేస్తా. 15 రోజులు షూటింగ్, మరో 15 రోజులు కంపోజింగ్‌లో ఉంటా. షెడ్యూల్ విషయంలో చాలా పక్కాగా ఉంటా. ప్రతి సినిమాకు కావాల్సిన సమయాన్నిస్తా. నా వల్ల ఏ సినిమా కూడా ఆలస్యం జరగదు. 

నాకు మొదటి నుంచి తెలుగు సినిమాల్లో చేయాలనే ఉంది. కాకపోతే సరైన జర్నీ కుదరలేదు. వెంకీ అట్లూరి ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వరుసగా హిట్స్ అవడంతో తెలుగులో ప్రాజెక్టులు పెరిగాయి. ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉంది.

సంగీత దర్శకుడిగా తెలుగులో ప్రస్తుతం -అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నా. అలాగే దుల్కర్‌తో ‘ఆకాశంలో ఒక తార’, ‘శ్రీ శ్రీ’ సినిమాలు చేస్తున్నా. తమిళ్లో పా. రంజిత్‌తో ఒక సినిమా చేస్తున్నా. అనిల్ రావిపూడి నన్ను ఇసుకలో పాతిపెట్టిన రీల్ చాలా వైరల్ అయింది. మేము సరదాగా చేశాం. కాకపోతే అంత వైరల్ అవుతుందని మేము ఊహించలేదు. -అనిల్ రావిపూడి చాలా స్వీట్ పర్సన్. ఆయనలో చాలా గొప్ప ఎనర్జీ ఉంటుంది. ఆయనతో పనిచేయడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. 

-నటుడిగా ‘ఇమ్మోర్టల్’ సినిమా చేస్తున్నా. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో సెప్టెంబర్ 4న రిలీజ్ అవుతుంది. నటుడిగా తెలుగులో కూడా మంచి కథ వస్తే తప్పకుండా చేస్తా.