11 May, 2026 | 9:43 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

జనగణన సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ అక్షరా శ్రీనివాస్

11-05-2026 08:57 PM

దోమకొండ,(విజయక్రాంతి): దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో సర్పంచ్ అక్షరా శ్రీనివాస్, అధికారుల ఆధ్వర్యంలో జనగణన సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ జనగణన సర్వేకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు జనగణన వివరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి కుటుంబం సరైన సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేందర్ గౌడ్‌తో పాటు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.