ప్రజలందరూ ‘సర్’లో తప్పక పాల్గొనాలి
టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పిలుపు
సంగారెడ్డి, జూన్ 25 :ప్రజలందరూ సర్ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనాలని టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కంది మండలం ఏద్దుమైలారం గ్రామంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కు అత్యంత విలువైనదని, తమ ఓటును కాపాడుకోవడానికి ప్రతీ ఒక్కరూ సర్ ప్రకియలో పాల్గొనాలని అన్నారు.
ఓటర్ల జాబితా సవరణ అనేది ఇదే తొలిసారి కాదని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇది ఎనిమిదోసారి జరుగుతున్న సవరణ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు గౌడ్, కంది మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోగులయ్య, ఎద్ధుమైలారం సర్పంచ్ చంద్రయ్య, మాజీ సర్పంచ్ మల్లారెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






