ముక్తాపూర్‌లో ‘సర్’ సర్వేను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
26-06-2026 12:00 AM
నాగలిగిద్ద, జూన్ 25: సర్-2026 కార్యక్రమంలో భాగంగా నాగలిగిద్ద మండల పరిధిలోని పీఎస్-230 ముక్తాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న హౌస్ టు హౌస్ సర్వే, మ్యాపింగ్ ప్రక్రియను సబ్ కలెక్టర్ ఉమ హారతి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నాగలిగిద్ద తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డితో కలిసి గ్రామంలో పర్యటించిన ఆమె, బీఎల్‌ఓలు నిర్వహిస్తున్న ఓటరు వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. అనంతరం మండలంలోని అన్ని గ్రామాల పోలింగ్ కేంద్రాల్లో సర్-2026 హౌస్ టు హౌస్ సర్వే, మ్యాపింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి సబ్ కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ అధికారులు, ఎన్నికల సిబ్బంది, బీఎల్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.






