29 July, 2026 | 1:04 AM

ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి: సర్పంచ్ వీరలక్ష్మి

29-07-2026 12:00 AM

మఠంపల్లి జూలై 28:ప్రతి ఒక్కరూ బాధ్యత గా మొక్కలు నాటాలనిపర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని,మొక్కల పెంపకం ద్వారా వాతావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని మఠంపల్లి సర్పంచ్ ఏసుమల్ల వీరలక్ష్మి పాపయ్య అన్నారు. మంగళవారం వనమహెూత్సవ కార్యక్రమ సందర్బంగా వారు మాట్లాడుతు పర్యావరణ పరిరక్షణ,హరితహారం లక్ష్యాల సాధనలో భాగంగా వివిధ రకాల మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి,దానిని సంరక్షించడం ద్వారా పచ్చని పర్యావరణాన్ని భావితరాలకు అందించాలనే సందేశాన్ని ప్రజలకు అందించాలని,ప్రజలు తమ ఇళ్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ ప్రదేశాల్లో విస్తృతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శౌరి,ఎపిఓ ఉమా, కార్యదర్శి వెంకటేశ్వర్లు,ఎఇఓ శ్రావ్యాంజలి, త్రివేణి,ఏసుమల్ల రాములు,జోసు,పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.