24 June, 2026 | 3:08 PM

Breaking News

నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్‌కు నూతన మండల అధ్యక్షుల నియామకం   •   పాఠశాలకు వచ్చిన జాతీయ పక్షి.. నెమలిని చూసి మురిసిపోయిన చిన్నారులు   •   విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ   •   పారిశుద్ధ్య పనులు ముమ్మరం   •   గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలి   •   జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తహశీల్దారుకు వినతి   •   యువతను ప్రమాదంలోకి నెట్టే మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   యువత, చిన్నారులు డ్రగ్స్ పట్ల దూరంగా ఉండాలి: సీఐ సంజీవ్   •   చీర్లవంచలో అరుణోదయ మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ   •  

డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలి

29-04-2026 06:30 PM

మంగపేట,(విజయక్రాంతి): యువత చెడు వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని  మంగపేట రెండవ యస్ఐ శ్రీకాంత్ అన్నారు. యువత చెడు మార్గంలో ప్రయాణించడంలో డ్రగ్స్ ప్రభావం అనే విషయంపై ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, మంగపేట ఎస్సై టీవీఆర్ సూరి ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని తెలంగాణ సెంటర్ లో  యువతకు, ఆటో డ్రైవర్లకు బుధవారం అవగాహనా సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ యువత గంజాయి, మద్యపానం, ధూమపానం, మాదక ద్రవ్యాలు లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అన్నారు. చెడు వ్యసనాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఎక్కడైనా, ఎవరైనా గంజాయి, డ్రగ్స్ రవాణ చేస్తున్నట్లు, విక్రయిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.