29 April, 2026 | 7:22 PM

గిరిజన ఆశ్రమ పాఠశాలలో 98.23% ఫలితాలు

29-04-2026 06:11 PM

నిర్మల్,(విజయక్రాంతి): పదవ తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ సాధించినట్లు జిల్లా జాదవ్ అంబాజీ నాయక్  తెలిపారు. మొత్తం జిల్లాలో 17 ఆశ్రమ గిరిజన పాఠశాలలు ఉండగా 436 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 429 ఉత్తీర్ణులయ్యారని వివరించారు. ఖానాపూర్ కు చెందిన వంశీ 575 మార్కులతో జిల్లాలో టాపర్గా నిలిచినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో 205 బాలురు, 229 బాలికలు ఉన్నట్టు ఆయన వివరించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు