8 August, 2026 | 2:52 AM

చేవెళ్ల బల్దియాలో ‘క్లీన్ అండ్ గ్రీన్’

08-08-2026 01:54 AM

చేవెళ్ళ ఆగష్టు 07 (విజయక్రాంతి): చేవెళ్ళ మున్సిపల్ లోని 14వ వార్డులో పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్  చైర్పర్సన్ దేవర సమత వెంకట్ రెడ్డి, 14వ వార్డు కౌన్సిలర్ మద్దెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శిధిలావస్తలో ఉన్న మల్లెల్ల చంద్రయ్య ఇంటిని కూల్చి క్లీన్ చేశారు. పక్కనే ఉన్న బేగరి జంగయ్య ఇంటి ముందున్న పిచ్చి మొక్కలను తొలగించారు. టౌన్ లోని  శిధిలావస్థలో ఉన్న ఇల్లు పాములు, పందులు, కుక్కలకు స్థావరం కావడంతో దోమల బెడద అధికంగా ఉందని కాలనీవాసులు బల్దియా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన చైర్పర్సన్, కౌన్సిలర్ పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా క్లీన్ చేశారు.