15-01-2026 01:39:11 AM
చిట్యాల, జనవరి 14 (విజయ క్రాంతి): వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమకు ఆసక్తి ఉన్న క్రీడలలో రాణించాలని నల్గొండ డిఎస్పి కే.శివరాం రెడ్డి అన్నారు. బుధవారం చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో డివైఎఫ్‌ఐ ఎస్‌ఎఫ్‌ఐ ల ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కాసేపు కబడి ఆడి అక్కడ ఉన్న పలువురిని ఆనందపరిచారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి దూదపడతాయని యువత క్రీడలపై ఆసక్తి పెంచుకొని ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు నేటి సమాజంలో యువత ఎక్కువగా గంజాయి డ్రగ్స్ ఆన్లైన్ బెట్టింగ్ వంటి దురాలవాట్లకు లోనై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని వాటికి దూరంగా ఉండాలని అన్నారు.
సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తున్న డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాల నాయకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, నార్కెట్పల్లి సీఐ నాగరాజు, ఎస్త్స్ర మామిడి రవికుమార్, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లo మహేష్ పాల్గొన్నారు.