17 March, 2026 | 4:20 PM

పాఠశాల భవనానికి శంకుస్థాపన

15-01-2026 01:37 AM

సంస్థాన్ నారాయణపూర్, జనవరి 14 (విజయ క్రాంతి): సంస్థాన్ నారాయణపూర్ మండలం అల్లందేవిచెర్వు గ్రామంలో పాఠశాల భవన నిర్మాణానికి ఇ ఎల్ వి ఫౌండేషన్ చైర్మెన్ ఇరుగుదిండ్ల భాస్కర్ శంకుస్థాపన చేశారు.ప్రాథమిక పాఠశాలలో ఒకే తరగతి ఉండడంతో ఇబ్బందులు పడుతున్న పిల్లలను వారి తల్లిదండ్రులు పాఠశాలకు పంపకుండా ప్రైవేటు పాఠశాలకు పంపుతున్న విషయం సర్పంచ్ సుర్వి సౌజన్య రాజు గౌడ్ ద్వారా తెలుసుకొని బుధవారం తరగతి గది నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని ఆ ప్రభుత్వ పాఠశాలలో వసతులు లేకపోవడంతో ప్రజలు ప్రభుత్వ పాఠశాలకు పంపించకుండా అప్పులు చేసి మరీ ప్రైవేటు పాఠశాలలకు తమ పిల్లలను పంపించే దుస్థితి నెలకొనడం బాధాకరమన్నారు. పేద విద్యార్థులకు చదివించే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రైవేట్ స్కూల్లకు దీటుగా ఇక్కడ విద్యను అందించే బాధ్యత ఈ గ్రామ సర్పంచ్ ఎంఈఓ చూసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్, ఎంఈఓ శ్రీనివాసులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనకసేన, అల్లందేవిచెరువు గ్రామ ఉపసర్పంచ్ ముక్యర్ల కవిత స్వామి యాదవ్, చిమిర్యాల గ్రామ సర్పంచ్ ఉప్పల రమేష్ గౌడ్, లింగవారిగూడెం గ్రామ సర్పంచ్ కత్తుల వాసు,పుట్టపాక ఉపసర్పంచ్ కిరణ్, సర్వేల్ గ్రామ ఉపసర్పంచ్ కట్కూరి భాస్కర్ గౌడ్,గుజ్జ ఉపసర్పంచ్ ఎలిజాల శీను, బిజెపి మండల ఉపాధ్యక్షులు సంపతి సుధాకర్ రెడ్డి, గ్రామ పెద్దలు, మహిళలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.