8 April, 2026 | 3:07 AM

ప్రతిఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరచుకోవాలి

08-04-2026 01:15 AM

పాలకవీడు, ఏప్రిల్ 7: ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరచుకోవాలని పాలకవీడు ఆరోగ్య ఉప కేంద్రం డాక్టర్ సోమ్య అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా మంగళవారం పాలకవీడు మండలంలోని  ఆరోగ్య ఉప కేంద్ర ఆధ్వర్యంలో ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడానికి ఆరోగ్య ఉప కేంద్రం సిబ్బంది మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా పాలకీడు మండల ఉప కేంద్రం డాక్టర్ సౌమ్య, మాట్లాడుతూ సమయానికి టీకాలు తీసుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శుభ్రమైన తాగునీరు వినియోగించడం, పొగ త్రాగడం  మద్యపానం నివారించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.

అలాగే గర్భిణీ స్త్రీలు,బాలింతలు, చిన్నారులు నియమితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన పోషకాహారం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.హెచ్. పిఏఎన్‌ఎం లు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.