07-06-2025 10:40:43 PM
సిబిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్..
మునగాల: సిపిఐ పార్టీ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించి ఆదరించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్(CPI state executive member Ganna Chandrasekhar) అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కార్యాలయంలో కంప్యూటర్ ప్రింటర్ను మునగాల సిపిఐ మండల కార్యదర్శి చిలంచర్ల ప్రభాకర్ అందజేశారు. ఈ సందర్భంగా గన్న చంద్రశేఖర్ మాట్లాడుతూ... పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేయుత అందివ్వాలని కోరారు. అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందారని అన్నారు. సిపిఐ పార్టీ నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా కార్మిక సభ్యులు రాములు శ్యామల అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు