ప్రమాద బీమా పథకంలో చేరి.. కుటుంబసభ్యులకు భరోసా కల్పించాలి
కొత్తగూడ సర్పంచ్ బొక్క సువర్ణ అంజిరెడ్డి
ఎస్బిఐ బ్యాంక్ అధికారులు
కందుకూరు,జూన్ 4(విజయక్రాంతి): గత సంవత్సరం నవంబర్ నెలలో కొత్తగూడ గ్రామానికి చెందిన కుమ్మరి లక్ష్మయ్య, అరుంధతి కుమారుడు రాహుల్ తేజ తుక్కుగూడ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కందుకూరు ఎస్బిఐ బ్యాంక్ లో తన ఖాతాతో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ పథకంలో 2 వేల రూపాయలు ప్రీమియం చెల్లించాడు. ఈ ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా 40 లక్షల రూపాయల చెక్కును ఆయన బ్యాంకు రివిజనల్ మేనేజర్ సంజయ్ కుమార్,చీఫ్ మేనేజర్ శ్రీకాంత్,కందుకూరు బ్యాంక్ మేనేజర్ వి.రవి,రాహుల్ తేజ కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈసందర్భంగా బ్యాంకు అధికారులు,కొత్తగూడ సర్పంచ్ లు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రమాద బీమా పథకంలో పలు రకాల ప్రీమియం చెల్లింపుల ద్వారా 1000 రూపాయలకు 20 లక్షలు, 2000 రూపాయలకు 40 లక్షలు, 3000 రూపాయలకు 60 లక్షలు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు అట్టి డబ్బులు రక్షణ కవచంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు. ఈ అవకాశాలను అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రమాదవశాత్తూ జరిగే ఇలాంటి సంఘటనలు వారి యొక్క కుటుంబ సభ్యులకు భరోసాగా ఉంటుంది అన్నారు. ఈకార్యక్రమంలో కొత్తగూడ సర్పంచ్ బొక్క సువర్ణ అంజిరెడ్డి,మాజీ సర్పంచ్ సాధ మల్లారెడ్డి,బొక్క సురేందర్ రెడ్డి,కుమ్మరి గణేష్,బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.






