4 June, 2026 | 1:29 PM

బోధన్ డివిజన్ రుద్రూర్ఎస్సై పై బదిలీ వేటు

04-06-2026 12:18 PM

బోధన్:(విజయక్రాంతి): బోధన్ డివిజన్ రుద్రూర్ఎస్సై(Rudrur SI) పై బదిలీ వేటు పడింది. ఎస్సైగా పనిచేస్తున్న సాయన్న పై ఎట్టకేలకు బదిలీ వేటు వేశారు. ఇటీవల రుద్రూర్ లో పీడీఎస్ బియ్యం కేసు విషయం లో జరిగిన ఎస్ ఐ పై వచ్చిన ఆరోపణలులో  సీపీ సాయి చైతన్య విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఎస్ ని బదిలీ చేశారు. ఎస్ ఐ సాయన్న ను విర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా లో బదిలీ అయిన 23 మంది ఎస్ ఐ లలో సాయన్న ను బదిలీ చేసిప్పటి కి ఎలాంటి పోస్టింగ్ కేటాయించక పోవడం చర్చకు దారితీసింది.