4 June, 2026 | 2:15 PM

వార్డులలో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తాం

04-06-2026 01:01 PM

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో వార్డులలో సభలు 

షాద్ నగర్ జూన్ 4 (విజయక్రాంతి): ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  హామీ ఇచ్చారు. వార్డులో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డు లో నిర్వహించిన "ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల" కార్యక్రమంలో భాగంగా వార్డు సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ప్రాంతంలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ప్రజా పాలన ద్వారా ప్రజల అభిప్రాయాలు, అవసరాలు తెలుసుకొని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సహకారంతో వార్డు అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందె మోహన్ ముదిరాజ్, 7వ వార్డు కౌన్సిలర్ కొప్పునూరి ప్రవీణ్, మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి, కౌన్సిలర్లు మురళీమోహన్, అప్పి, దిలీప్, బచ్చలి నరేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, శ్రీశైలం గౌడ్, ముబారక్ అలీ ఖాన్, కాలనీవాసులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.