23 March, 2026 | 11:23 PM

ప్రతి ఒక్కరు స్వచ్ఛతపై దృష్టి సారించాలి

23-03-2026 12:00 AM

రాజేంద్రనగర్, మార్చి 22 (విజయ క్రాంతి) : ప్రతి ఒక్కరు నీబద్ధతతో ఇంటి పరిసరాలను కాలనీ రోడ్లను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు కృషి చేయాలని పద్మశ్రీ హిల్స్ కాలనీ వాసులు పిలుపునిచ్చారు. ఆదివారం బండ్లగూడ జాగీర్ లోని పద్మశ్రీ హిల్స్ కాలనీ లో  ఆదివారం కమ్యూనిటీ స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీవాసులు అందరూ ఒక వేదిక పైకి వచ్చి కాలనీలో ఉన్న చెత్తాచెదారాన్ని పిచ్చి మొక్కలను తొలగించారు. సమాజం పట్ల  బాధ్యత  బలమైన నిబద్ధతను ప్రదర్శిస్తూ చురుకుగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం లో సి. టి.ఎం సభ్యులు సందీప్, మధు, అనురూప్ మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు రాజశేఖర్ రెడ్డి, సావర్కర్, సతీష్ మరియు కాలనీ వాసులు పిల్లలతో సహా దాదాపు 80 మందికి పైగా నాలుగు గ్రూపులుగా పాల్గొనీ కాలనీలోని అన్ని వీధులను శుభ్రం చేయడం జరిగింది. ప్రతి అపార్ట్మెంట్లో అవగాహన ప్రకటనలు కూడా చేయడం జరిగింది. దాదాపు ఒక ట్రాక్టర్ నిండా చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ కు పంపించారు.