ఘనంగా గ్రామ దేవతల ఉత్సవాలు
జగదేవపూర్,(విజయక్రాంతి): అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఇన్చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో గ్రామ దేవతలు శ్రీ పెద్దమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలకు హాజరై ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ దీన రాజలింగం మాట్లాడుతూ ఆహ్వానం మేరకు గ్రామానికి వచ్చి ఉత్సవాలలో పాల్గొన్న గజ్వెల్ ఇంచార్జి ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డిలకు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.అమ్మవార్ల ఆశీర్వాదంతో గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు పండి గ్రామం అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి,మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు జగదేవపూర్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్,మాజీ జడ్పీటీసీ చెరుకు లక్ష్మారెడ్డి,ఉప సర్పంచ్ నరేష్, గ్రామ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా,ఆయా గ్రామాల సర్పంచ్లు,మండల నాయకులు,వార్డు సభ్యులు బాబు గ్రామ నాయకులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






