9 July, 2026 | 7:05 PM

పంతులకు పాలనాధికారి పాఠాలు

09-07-2026 06:16 PM

నిర్మల్ జులై 9 (విజయక్రాంతి):  జిల్లా పాలనాధికారి (జిల్లా కలెక్టర్) భవేష్ మిశ్రా గురువారం జిల్లా కేంద్రంలో పంతులకు (టీచర్స్) పాఠాలు బోధించారు. జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను సందర్శించారు. శిక్షణ లో భాగంగా బోర్డుపై వివిధ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలను బోధించి ప్రశ్నల రూపంలో జవాబులను రాబట్టారు. మూడు రోజుల వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు ప్రతి ఒక్కరు చదివించుకోవాలని కొత్త అంశాలను విద్యార్థులకు అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అధికారులు ఉన్నారు.