జేఏసీ ఆధ్వర్యంలో బందుకు పిలుపు
కరీంనగర్ క్రైమ్ జులై 09: కరీంనగర్ సెంట్రల్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బందుకు పిలుపు ఇవ్వడం భవన నిర్మాణ కార్మికుల సంఘాలు (జేఏసీ) వారి ఆధ్వర్యంలో కరీంనగర్ సెంట్రల్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు జూలై 9 నుండి 14 వ తేదీ వరకు 6 రోజులు పనుల బంద్ కు పిలుపు ఇవ్వడం భవన నిర్మాణ కార్మికులు అందరూ సంయుక్తంగా కరీంనగర్ లో భవన నిర్మాణ పనులకు బంద్ ప్రకటించడం అందులో భాగంగా ఎలక్ట్రిషన్ అందరూ పనులను బంద్ చేశారు.
లేబర్ కార్డును విధిగా కలిగి ఉండాలని, పనికి రేట్ లు పెంచాలని ఈ బంద్ ను పాటిస్తున్నట్లు తెలిపారు. సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు లేబర్ కార్డు కలిగి ఉండాలని , ప్రభుత్వ పథకాలకు అర్హతగా ఈ లేబర్ కార్డు ని గుర్తిస్తారని తెలియజేయడం జరిగింది. భవన నిర్మాణ సమయంలో ఇంటి యజమాని లేబర్ కార్డు కలిగి ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే తమ నిర్మాణానికి కార్మికులుగా నియమించుకోవాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాజబాబు, వైస్ ప్రెసిడెంట్ పాపయ్య, కార్యదర్శి బషీర్, మహేష్, క్యాషియర్ నవీన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అనిల్ రెడ్డి, గంగ రెడ్డి, బాడీ మెంబర్స్ మరియు ఎలక్ట్రిషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది.






